ముద్ర,గద్వాల:
విద్యార్థులు తాము చదివే కోర్సుల్లోని సబ్జెక్ట్‌లపై నైపుణ్యాలు సాధించాలని, ఆ దిశగా జీవితంలో స్థిరపడేందుకు ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగితే స్వయం ఉపాధి రంగంలో రాణించవచ్చని గద్వాల జిల్లా ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ టి. రామలింగేశ్వర గౌడ్ అన్నారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం మంగళవారం గద్వాలలోని ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ లో చదివే విద్యార్థులకు ఎన్ఎస్ఎస్ విభాగం, వ్యవస్థాపక అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో “ Self Employment & Entrepreneurship Development ”స్వయం ఉపాధి పథకాలు, అవకాశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు, విద్యార్థులకు అందిస్తున్న అవకాశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. . ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు, విద్యార్థులకు అందిస్తున్న అవకాశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోగులాంబ గద్వాల జిల్లా ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ టి. రామలింగేశ్వర గౌడ్ రిసోర్స్ పర్సన్‌గా హాజరై విద్యార్థినులకు స్వయం ఉపాధి అవకాశాల ప్రాముఖ్యత, ప్రస్తుత కాలంలో పరిశ్రమల స్థాపనలో ఉన్న అవకాశాలు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు గురించి సమగ్రంగా వివరించారు. విద్యార్థులు ఉద్యోగాన్వేషకులుగా కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాల్సిన అవసరాన్ని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భరభారత్ వికాసిత్ భారత్ లాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడతాయో వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించే అవకాశాలను సైతం వివరించారు. తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలైన PMEGP, T-PRIDE, T-IDEA, PMVK, DEET మరియు Udyam Registration వంటి కీలక పథకాల గురించి వివరించి, వాటి ద్వారా ఎలా ఆర్థిక సహాయం పొందాలి, బ్యాంకు రుణాలు ఎలా పొందాలి, సబ్సిడీలు ఎలా పొందవచ్చు అనే అంశాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్పష్టంగా తెలియజేశారు. అలాగే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విధానం, అవసరమైన డాక్యుమెంట్స్, అప్లికేషన్ ప్రాసెస్ పై స్టెప్ బై స్టెప్ మార్గదర్శనం అందించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ. మీనాక్షి మాట్లాడుతూ, విద్యార్థినులు ఈ వర్క్‌షాప్‌ను సద్వినియోగం చేసుకొని తమలోని ప్రతిభను వెలికి తీసి స్వయం ఉపాధి రంగంలో ముందుకు రావాలని, ఆత్మనిర్భర భారత్ లక్ష్యాన్ని సాధించడంలో తమ వంతు పాత్ర పోషించాలని ప్రోత్సహించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో యువత ముఖ్య పాత్ర పోషించాలని ఆమె సూచించారు.
అలాగే ఈ కార్యక్రమంలో ఎంట్రప్రెన్యూర్ డెవలప్మెంట్ సెల్ జిల్లా మేనేజర్ దయాకర్, అసిస్టెంట్ మేనేజర్ శ్యామల పాల్గొని..విద్యార్థులకు స్టార్టప్ ఐడియాస్, చిన్న పరిశ్రమల స్థాపన, మార్కెటింగ్ వ్యూహాలు, నైపుణ్యాల అభివృద్ధి వంటి అంశాలపై విలువైన సూచనలు అందించారు.
ఈ కార్యక్రమాన్ని కళాశాల Placement Cell కన్వీనర్ ఎం. సమత, ఎన్ఎస్ ఎస్ కోఆర్డినేటర్ బి. జగన్ మోహన్ అధ్యాపకులు ఎం దేవుజా, లక్ష్మీనారాయణ బ్రహ్మేశ్వర్ మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.