కోరుట్ల, ముద్ర;
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా జగిత్యాల జిల్లా కోరుట్ల కు చెందిన డా. వై. అనూప్ రావు ను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు డా. వై. అనూప్ రావు కు నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా డా. అనూప్ రావు మాట్లాడుతూ నా నియామకానికి సహకరించిన ఇందురు పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్, జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, బిజెపి పట్టణ అధ్యక్షులు కస్తూరి లక్ష్మీనారాయణ, కౌన్సిలర్లు తిరుమల వాసు, రుద్ర సుజాత, కలాల రాధ సాయిచందు, గూగులోతు శ్రీకాంత్, కోరుట్ల మండలాధ్యక్షులు పంచరీ విజయ్, తదితరులు పాల్గొన్నారు.