జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి : ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు లావుడియ రాజు
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు, లావుడియ రాజు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక సుందరయ్య భవనంలో భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎస్ఎఫ్ఐ కమిటీ నుండి బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ఏర్పడి 8 సంవత్సరాలు గడుస్తున్న కనీసం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. జిల్లా కేంద్రానికి 5000 మంది విద్యార్థులు ప్రైవేటు కళాశాలలో చదువుతున్న పరిస్థితి ఉంది, భువనగిరిలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళాశాల ఏడెడ్ కళాశాల ఉందని ఈ కళాశాలను ప్రభుత్వమే తన ఆధీనంలో తీసుకొని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళాశాలను, ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ధరావత్ జగన్ నాయక్, పుట్టల ఉదయ్ పాల్గొన్నారు.