ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
ఆటలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానిస్తాయని జిల్లా యువజన, క్రీడల అధికారి కే. ధనంజనేయులు అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యా చరణ ప్రణాళిక యువజన, క్రీడల వారోత్సవాలలో 4వ రోజు గురువారం ఆడండి, పాల్గొనండి – క్రీడా దినోత్సవం క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి బ్యాడ్మింటన్, వాలీబాల్, షాట్ పుట్, అథ్లెటెక్స్, వంటి క్రీడాలు భువనగిరి లోని ఇండోర్ స్టేడియం, ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో షాట్ పుట్, అథ్లెటెక్స్ 400 మీటర్స్, 800 మీటర్స్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐలయ్య, శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది మురళి, శ్రీనివాస్, కుమార్ పాల్గొన్నారు