- కార్మికులకు ఐక్యవేదిక నాయకుల విప్లవ అభివదనాలు.
యైటింక్లయిన్ కాలని. ముద్ర: కార్మికవర్గ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. బుధవారం జాతీయ కార్మిక సంఘాల తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో, సింగరేణి రామగుండం 2వ ఏరియా కార్మికులు కదం కలిపి సమ్మె సక్సెస్ చేశారు. ఫలితంగా రామగుండం వకీల్ పల్లె గని కార్మికులు సమ్మెలో సంపూర్ణంగా కదం కలుపగా, ఓసీపీ.3 ప్రాజెక్టు, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ లో మాత్రం స్తానిక యాజమాన్యం కొద్దిమంది కార్మికులతో ఎన్.టి.పి.సి విద్యుత్ ప్లాంటు కు బొగ్గు రవాణా పనులు చేపట్టారు. మొత్తానికి సమ్మె సక్సెస్ అయింది. ఇక సమ్మె విజయవంతం చేసిన కార్మికులకు సింగరేణి కార్మికసంఘాల ఐక్యవేదిక ఏరియా నాయకులు అభినందనలు, విప్లవాభివందనాలు తెలిపారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ.. కార్మిక వర్గానికి వ్యతిరేకంగా బిజెపి ప్రభుత్వం తెచ్చిన 4 కోడ్ లకు వ్యతిరేకంగా, ఐక్యవేదిక ఇచ్చిన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేసిన ఏరియా కార్మికులకు, ఐక్యవేదిక లో భాగస్వాములైన కార్మిక సంఘాల నాయకులకు, మద్దతు తెలిపిన రాజకీయ సంఘాల నాయకులకు ఏరియా ఐక్యవేదిక నాయకులు అభివందనాలు, విప్లవాభివదనాలు తెలియజేశారు. ఇప్పటికైనా కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం దిగివచ్చి కార్మిక వ్యతిరేకంగా తీసుకువచ్చిన నాలుగు నల్ల చట్టాలు (4 కోడ్ లను) రద్దుచేసి, కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. కుదరదని మొండికేస్తే, నిరవధిక సమ్మెకు సైతం వెనుకాడబోమని నాయకులు కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక సమ్మె సక్సెస్ లో ఏఐటీయూసీ నాయకులు ఎల్. ప్రకాష్, వై.వి. రావు, కందుకూరి రాజారత్నం, జీగురు రవీందర్, బి. అన్నారావు, శాంసన్ సాంబాశివరావు, డిటి రావు, మల్లేష్, ఐఎన్టియూసి నాయకులు బి. శంకర్ నాయక్, గడ్డం తిరుపతి యాదవ్, కొంగర రవీందర్, గునుగుంటి వెంకటస్వామి, సంపత్ రెడ్డి, సిఐటియూ నాయకులు వెంకన్న, ప్రవీణ్ కుమార్, నరసింహారావు, టీబీజీకేఎస్ నాయకులు ఐలి శ్రీనివాస్, నాగేల్లి సాంబయ్య, శ్రీనివాసరెడ్డి, వివిధ సంఘాలకు చెందిన నాయకులు హరిప్రసాద్, శ్రీనివాస్, మహేందర్, కుమారస్వామి, క్రిష్ణ, శ్రీనివాస్, ఆంజనేయులు, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
