Take a fresh look at your lifestyle.

జులై 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

  • ఐసిడిఎస్ కార్యాలయ సిబ్బందికి సమ్మె నోటీస్ అందజేత.
  • నూతనంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి.
  • సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎం శంకర్ నాయక్.

అచ్చంపేట,ముద్ర విలేఖరి: నాగర్ కర్నూలు జిల్లాఅచ్చంపేట పట్టణం దశాబ్ద కాలంగా కార్మిక వర్గం అనేక త్యాగాలు పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటిని కేవలం నాలుగు లేబర్ కోడ్లు గా తీసుకొచ్చి వాటి అమలుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వము తీవ్రంగా ప్రయత్నిస్తుందని వాటికి వ్యతిరేకంగా జులై 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎం శంకర్ నాయక్ కార్మికులను కోరారు. అచ్చంపేట ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయ సిబ్బంది జూనియర్ అసిస్టెంట్ సుధాకర్ కు సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమ్మె నోటీసు అందజేశారు.ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ.. నాలుగు లేబర్ కోడ్స్ అమలు జరిగితే కార్మిక సంఘాల ఏర్పాటు కష్టతరమవుతుందని కార్మికుల సమిష్టి భేరాసారాల శక్తి నిర్వీర్యం చేయబడుతుందని, సమ్మెకు సైతం పరమితులు ఏర్పడతాయని, ఉద్యోగ భద్రత ఉపాధి కోల్పోతారని, కార్మిక శాఖ కూడా నిర్వీర్యం చేయబడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.2025 జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అధిక సంఖ్యలో పాల్గొని సమ్మెనుజయప్రదం చేయాలని అన్నారు.దేశవ్యాప్తంగా రద్దు చేసిన కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని అంగన్వాడి లను కార్మిక చట్టాల పరిధిలోకి తేవాలని పర్మినెంట్ పైన గుజరాత్ హైకోర్టు ఆదేశాలను అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్స్ గ్రాట్యూటీ పైన సుప్రీంకోర్టు ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు రెగ్యులరైజ్ చేస్తూ హెల్పర్లకు 26000 మరియు టీచర్లకు 32000 కనీస వేతనం ప్రకటించాలని డిమాండ్ చేశారు రిటైర్మెంట్ అయినా అంగన్వాడీ టీచర్లు ఆయాలకు కనీసం పెన్షన్ 9000 ఇవ్వాలని, 45వ మరియు 46వ ఐ ఎల్ సి యొక్క సిఫారసులు ప్రకారం పెన్షన్ ఈఎస్ఐ పిఎఫ్ మొదలైన సౌకర్యాలు కల్పించాలి నూతన జాతీయ విధానాన్ని ఉపసర్పరించుకోవాలి నిర్బంధ విద్యా వ్యవస్థకు ఈసీసీని లింకు చేయరాదని డిమాండ్ చేశారు పెన్షన్ ఎక్స్గ్రేషన్ మరియు ఇతర సామాజిక భద్రత చర్యలు నిర్ధారించే వరకు ఉద్యోగాల నుండి తొలగించరాదని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దేశా నాయక్ అంగన్వాడీ యూనియన్ నాయకురాలు పార్వతమ్మ భారతి చంద్రకళ, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జయ చంద్రకళ సంతూలి రమ పద్మ మంగమ్మ మేఘమాల సంతోషి విజయ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.