Take a fresh look at your lifestyle.

అంబేద్కర్ విగ్రహా విష్కరించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

గొల్లపల్లి, ముద్ర విలేకరి: జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం శ్రీరాముల పల్లె గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని  మంగళవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహా విష్కరణ మహోత్సవంలో నన్ను భాగస్వాములను చేసినందుకు చాలా సంతోషంగా ఉందని,దేశంలో ఉన్న అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు చేకూర్చే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించడం  జరిగిందని, అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన అంబేద్కర్ స్మృతికి నివాళులర్పిస్తూ, ఆ మహనీయునికి ‘ భారతరత్న’ అవార్డును ఇవ్వడం జరిగిందనీ వారు తెలిపారు. ముందు చూపుతో ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్‌ 3 ద్వారానే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ భీమ సంతోష్ ,వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి,జిల్లా గ్రంథాలయం మాజీ చైర్మన్ కటారి చంద్రశేఖర రావు.రమేష్ రెడ్డి,మాజీ సర్పంచ్ లు,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.