- భారీగా పెరిగిన టికెట్, పాస్ ధరలు.
- అమలులోకి వచ్చిన కొత్త ఛార్జీలు.
ముద్ర, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ పరిధిలో బస్సు ఛార్జీలు భారీగా పెరిగాయి. ఒకవైపు ఛార్జీలను పెంచమంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయాణికుల నడ్డి విరిచింది.పెరిగిన చార్జీలు అన్ని వర్గాల ప్రయాణికులపై ప్రభావం చూపించనున్నాయి. ముఖ్యంగా రోజూ బస్సుల్లో ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులపై ఈ ధరల పెంపు తీవ్రంగా ప్రభావితం చేయనుంది. దీంతో
ఇక బస్సుల్లో వెళ్లాలంటేనే ప్రయాణికులు జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్ని రకాల బస్సు పాసులపై ధరలను కూడా 20 శాతం మేరకు పెంచింది. ఈ కొత్త ఛార్జీలను తక్షణమే అమలులోకి తెచ్చింది. కాగాపెరిగిన బస్ పాస్ ధరల పట్ల ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ బస్‌పాస్ ధరలను ఏకంగా 20 శాతం పెంచింది.దీంతో ప్రస్తుతం రూ.1150 ఉన్న ఆర్డీనర్ బస్ పాస్ ధరను రూ.1400కు పెరిగగా రూ.1300 ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్ ధరను రూ.1600కు పెరిగింది. ఇక మెట్రో డీలక్స్ పాస్‌ను రూ.1,450 నుంచి రూ.1,800కు పెంచారు.