Take a fresh look at your lifestyle.

రికార్డ్ స్థాయిలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు

  • 8,378 కొనుగోలు కేంద్రాల నుండి 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు.
  • 2023 తో పోలిస్తే 13 లక్షల మెట్రిక్ టన్నులు అధికం.
  • 12.33 లక్షల మంది రైతులకు 15,121 కోట్ల చెల్లింపులు.
  • బీఆర్ఎస్ పాలనతో పోలిస్తే అదనంగా 9,139 కోట్ల చెల్లింపులు.
  • మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ధాన్యం దిగుబడి సంచలన రికార్డు నమోదు చేసుకుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.బి.ఆర్.ఎస్ పాలనతో పోల్చుకుంటే సరిగ్గా జూన్ 8 నాటికి అధికంగా 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఆయన వెల్లడించారు.సోమవారం హైదరాబాద్ లోని సచివాలయంలో ఆయన ధాన్యం కొనుగోళ్ల విషయంపై సంబందిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
బి.ఆర్.ఎస్ పాలన చివరి రోజుల్లో అంటే సరిగ్గా జూన్ 8 నాటికి నాటి ప్రభుత్వం 59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదే జూన్ 8 నాటికి 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని ఆయన తెలిపారు.వానా కాలం సీజన్ లో రికార్డు స్థాయిలో దిగుబడి అయిన ధాన్యాన్ని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ప్రస్తుత వానాకాలం సీజన్ లో సాగు ఆయిన విస్తీర్ణాన్ని దృష్టిలో పెట్టుకొని అదనంగా 1,344 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా బద్దంగా వ్యవహరించి కొనుగోలు ప్రక్రియను చేపట్టిందని ఆయన తెలిపారు.2023 యాసంగి సీజన్ లో నాటి ప్రభుత్వం 7,034 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి జూన్ 8 నాటికి 59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం అదే యాసంగి సీజన్ లో 8,378 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు. అదే విదంగా ధాన్యం కొనుగోలు చేసిన 12.33 లక్షల మంది రైతాంగానికి ప్రస్తుత ప్రభుత్వం 15,121 కోట్ల రూపాయలను చెల్లించామన్నారు.అదే గత యాసంగి సీజన్ లో అప్పటి ప్రభుత్వం 9.81 లక్షల మంది రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేసి 5,982 కోట్లు చెల్లించిందన్నారు.చెల్లింపులలో కూడా బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయాంలో యాసంగి సీజన్ లో జూన్ 8 నాటికి కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రస్తుత ప్రభుత్వం 9,139 కోట్లు అధికంగా చెల్లించామన్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా 2023 యాసంగి సీజన్ తో పోల్చుకుంటే అదనంగా 1,344 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలబడిందన్నారు.బి.ఆర్.ఎస్ పాలకులు గొప్పగా చెప్పుకునే కాళేశ్వరం నిరుపయోగంగా మారినా కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగం పట్ల అనుసరించిన విధానాలతో చరిత్రలోనే ముందెన్నడూ లేని రీతిలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి చేసుకోవడం వ్యవసాయ చరిత్రలోనే చరిత్రాత్మక ఘట్టంగా నిలిచి పోతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివర్ణించారు.

Leave A Reply

Your email address will not be published.