Take a fresh look at your lifestyle.

టీయూడబ్ల్యూజే సన్నాహక సమావేశం

కోరుట్ల, ముద్ర: టియుడబ్ల్యూజే జగిత్యాల జిల్లా శాఖకు త్వరలో జరగబోయే మూడవ మహాసభ కు సంబంధించిన సన్నాహక సమావేశం కోరుట్ల పట్టణంలోని మార్కండేయ భవనంలో శుక్రవారం రోజు జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు చీటీ శ్రీనివాసరావు పాల్గొనగా కోరుట్ల ప్రెస్ క్లబ్ సభ్యులు స్వాగతం పలికారు.అనంతరం శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా ఎన్నికల కార్యాచరణ నిర్వాహణకు సంబంధించిన,ఈ సమావేశంలో జర్నలిస్టుల సమస్యలపై అభిప్రాయాన్ని సభ్యులు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చీటీ శ్రీనివాసరావు, జిల్లా సంయుక్త కార్యదర్శి అల్లే రాము, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగుల గోపాల చారి, కోరుట్ల ఐజేయు గౌరవాధ్యక్షులు బివి. రంగారావు, కార్యదర్శి చలిగంటి వినోద్, ఉపాధ్యక్షులు ఎస్. సత్యారావు, నీలి అనిల్, బొడ్డుపల్లి అంజయ్య, రాజేష్, హరీష్, సిరిసిల్ల వేణు, పలు పత్రికల పాత్రికేయులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.