- నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్.
అచ్చంపేట ముద్ర విలేఖరి: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలంలోని మాచారం గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మే నెల 18వ తేదీన ప్రారంభించనున్న ఇందిరా సౌర గిరి జల వికాస పథకంనకు సంబంధించిన పనులను జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడి, జిల్లా అదనపు కలెక్టర్ దేవ సహాయం, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, లతో కలిసి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, సమీక్ష సమావేశం నిర్వహించారు.గిరిజన, చెంచు ప్రజల మెరుగైన జీవనం కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నల్లమల్ల అటవీ ప్రాంతంలోనీ అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఇందిరా సౌరగిరి జల వికాస పథకం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, మాట్లాడుతూ మాచారం గ్రామంలో చెంచు ప్రజలు సాగు చేసుకుంటున్న ROFR పట్టా భూములలో 50 ఎకరాల విస్తీర్ణంలో గల 13మంది రైతులకు చెందిన భూములలో జిల్లా భూగర్భ జల శాఖ అధికారులు సర్వే చేసి సూచించిన ప్రాంతాల్లో బోరు బావులు తవ్వించడం జరిగిందని అన్నిటిలోనూ పుష్కలంగా నీరు లభించిందని, రెడ్కో అధికారులు వాటికి సౌర విద్యుత్ అందించే ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. జిల్లా ఉద్యానవన శాఖల అధికారులు పండ్ల మొక్కలు నాటడానికి మార్కింగ్ చేసి గుంతలు తీసే పనులు చేపడుతున్నారని, తెలియజేశారు. ఆర్ అండ్ బి అధికారులు హెలిపాడ్ సిద్ధం చేయడం, ముఖ్య మంత్రి సభా వేదికను ఏర్పాటు చేసే పనులను చేపడుతున్నారని తెలిపారు. విద్యుత్ శాఖ,పంచాయతీ రాజ్ డీటీడీఓ, మిషన్ భగీరథ, రెవెన్యూ అధికారులు, తమకు కేటాయించిన పనులను చేపడుతున్నట్లు తెలియజేశారు. సంబంధిత శాఖ అధికారులందరూ పూర్తి సమన్వయంతో పనిచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డీఆర్డీవో పీడీ చిన్న ఓబులేసు, డి టి డి వో ఫిరంగి,భూగర్భ జల శాఖ ఎడి దివ్య జ్యోతి, డిపిఓ రామ్మోహన్ రావు, ఉద్యానవనశాఖ అధికారులు వెంకటేశం,జగన్, మిషన్ భగీరథ అధికారులు సుధాకర్, ఆర్ అండ్ బి అధికారులు నాగలక్ష్మి,జలంధర్, ఆర్ డబ్ల్యూ ఎస్.అధికారిని హేమలత , రెవెన్యూ అధికారులు, అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
