Take a fresh look at your lifestyle.

కరపత్రాలను విడుదల చేసిన అచ్చంపేట MLA డాక్టర్ వంశీకృష్ణ

అచ్చంపేట, ముద్ర విలేకరి: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం మచారం గ్రామంలో జలంధర్ రెడ్డి గారి స్వగృహంలో రాజ్యాంగ పరిరక్షణ వేధిక నాగర్ కర్నూల్ జిల్లా వారి ఆధ్వర్యంలో యువతా మేలుకో గంజాయి మానుకో కరపత్రాలను విడుదల చేసిన PAC మెంబర్ & అచ్చంపేట MLA డాక్టర్ వంశీకృష్ణ మరియు జిల్లా కలెక్టర్ సంతోష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ గత టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాకం వల్ల విచ్చలవిడిగా మాధకద్రవ్యాలు విద్యార్థులకు, యువకులకు అందుబాటులో ఉంచి విద్యార్మలను మత్తులో ముంచి నిరుద్యోగ సమస్యను ఈ విధంగా పరిష్కరించాలనుకొన్నది దీనివల్ల లక్షలాదిమంది విద్యార్థులు, నిరుద్యోగులు మత్తుకు బానిసలయ్యారు. హైద్రాబాద్ నుండి అమ్రాబాద్ దాకా ప్రతి పల్లెలో 5 నుండి 20 మంది దాకా ఈ మహమ్మారి బారిన పడటానికి చనిపోతున్నారని అన్నారుకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్ అటవీ శాఖ DFO రోహిత్ గోపిడి, పోలీస్ DSP శ్రీనివాసులు CBM ట్రస్ట్ చైర్ పర్సన్ డాక్టర్ అనురాధ మరియు ఛైర్మెన్ లు మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.