Take a fresh look at your lifestyle.

పట్నం శ్రీరాఘవేంద్ర హోటల్ ఆనియన్ దోశలో “బొద్దింక”

  • ప్రజా ఆరోగ్యంతో హోటల్ నిర్వాహకుల చెలగాటం.
  • రూ. 2500 జరిమానాతో సరిపెట్టిన మున్సిపల్ అధికారులు.

ముద్ర, ఇబ్రహీంపట్నం: అధిక లాభాలకు ఆశపడి నాణ్యత విషయంలో రాజీపడి కొనుగోలుదారులకు నాసిరకం టిఫిన్లను అందిస్తూ ప్రముఖ హోటళ్ల నిర్వాహకులు ప్రజల అనారోగ్యాలకు కారణమవుతున్నారు.శ్రీరాఘవేంద్ర హోటల్ లో టిఫిన్స్ కి అధిక ధరలు వసూలు చేస్తున్నా,నాణ్యత కరువై టిఫిన్లు కంపు కొడుతున్నాయి. కొనుగోలుదారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఖాతరు చేయని యాజమాన్యం అధిక లాభాల ఆశతో పాటు తమనెవ్వరు ఏమి చేయలేరన్న బరి తెగింపుతో నాసిరకం, పురుగులు పడిన టిఫిన్లను వడ్డిస్తోంది.శనివారం తన పిల్లలతో కలిసి టిఫిన్ చేయడానికి ఇబ్రహీంపట్నంలోని శ్రీరాఘవేంద్ర హోటల్ లో టిఫిన్ వెళ్లిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురయ్యింది.వివరాలలోకి వెళ్తేఇబ్రహీంపట్నంకు చెందిన హన్మంత్ కుమార్ (పోలీస్ కానిస్టేబుల్) శనివారం ఉదయం తన ఇద్దరు పిల్లలతో కలిసి శ్రీ రాఘవేంద్ర హోటల్ లో టిఫిన్ చేయడానికి వెళ్ళాడు.మూడు ఆనియన్ దోశలు ఆర్డర్ చేశాడు. దోశ తినే క్రమంలో దోశతో పాటు బొద్దింకలు కనిపించాయి.దోశను కాల్చే సమయంలో బొద్దింకలు సైతం ఫ్రై చేయబడి కనిపించడంతో మున్సిపల్ అధికారులకు పిర్యాదు చేశాడు.మున్సిపల్ అధికారులు రాఘవేంద్ర హోటల్ ను సందర్శించి నాణ్యత లేని ఆహార పదార్థాలను గుర్తించి నామమాత్రంగా రూ.2500 జరిమానా విధించారు.నాణ్యమైన ఆహరం అందించాల్సిన హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వినియోగదారులకు నాసిరకమైన ఆహార పదార్థాలను అందిస్తూ ప్రజల అనారోగ్యానికి కారణం అవుతున్న ఈ హోటల్ ను సీజ్ చేసి కేసు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.