Take a fresh look at your lifestyle.

అంగరంగ వైభవంగా కవయిత్రి మొల్ల మాంబ 586వ జయంతి వేడుకలు

 

ముద్ర, తాండూర్:

వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలోని అంతారం గ్రామంలో తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ 586వ జయంతి వేడుకలు తాండూర్ కుమ్మర సంఘం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఇట్టి జయంతి వేడుకల కార్యక్రమానికి అంతారం గ్రామ ప్రథమ పౌరురాలు శ్రీమతి జంగని లక్ష్మి వెంకటయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కవయిత్రి మొల్ల కుమ్మర కులానికి వన్నె తీసుకొచ్చిన మహిళా శ్రీ మూర్తి అని, సంస్కృతంలోని రామాయణాన్ని తెలుగులోకి అనువాదించి అందరి మన్ననాలు పొందిన గొప్ప ఆరాధ్య దేవత అని కొనియాడరు. ముఖ్యంగా తాండూర్ నియోజకవర్గ కుమ్మర జాతికి అనునిత్యం కష్టనష్టాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ కుమ్మర జాతిని ఎల్లప్పుడూ చైతన్య పరిచే ఉపాధ్యాయులు కుమ్మరి అంజలయ్య మాట్లాడుతూ.. కవయిత్రి మొల్ల కుమ్మర కులంలో జన్మించడం కుమ్మర కులస్తులం ఎంతో అదృష్టంగా భావించాలని, ఆమె గొప్పతనాన్ని సాటి సమాజానికి తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. ఆమె రామాయణాన్ని 871 గద్య పద్యాలు 6 కాండలలో కేవలం ఐదు రోజుల్లోనే అందరికీ అర్థమయ్యే సరళమైన భాషలో రచించి ఎంతోమంది కవి పండితుల, మన్ననాలు పొందిన స్త్రీ మూర్తి మొల్ల అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మొల్ల విగ్రహ స్థలానికి, ప్రతి కార్యక్రమానికి చేయూత అందిస్తున్న అంతారం గ్రామ పెద్దల యువకుల సహాయ సహకారాలు మరువలేనివని ఆయన తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జంగని లక్ష్మి, ఉప సర్పంచ్ వడ్డే రవి,మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శీను, అంతారం వార్డ్ మెంబర్లు, తాండూర్ కుమ్మర సంఘం అధ్యక్షులు పాండు, ప్రధాన కార్యదర్శి అనంతయ్య, శంకర్, నరసింహులు, పండరి, సత్తయ్య, సాయిలు, కిష్టయ్య, గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.