Take a fresh look at your lifestyle.

పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ సమావేశాలను విజయవంతం చేయండి.

ముద్ర,మోత్కూరు:
మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో నేడు,రేపు జరిగే బిజెపి ప్రశిక్షణ సమావేశాలను విజయవంతం చేయాలని బిజెపి సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా ప్రశిక్షణ కన్వీనర వంగవీటి శ్రీనివాసరావు కోరారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి బిజెపి కార్యకర్తలకు పార్టీ సైదానిక సిద్ధాంతాలు క్రమశిక్షణ బూతు స్థాయి నిర్మాణం పార్టీ బలోపేతం కావడానికి అనుసరించవలసిన యువాత్మక ప్రణాళికలు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడానికి అనుసరించవలసిన పద్ధతులు తదితర విషయాలపై ఈ ప్రశిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి ఈ సమావేశాలకు మోత్కూర్ టౌన్ ,మోత్కూరు రూరల్ అడ్డగూడూర్ మండల కార్యకర్తలు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షురాలు చాడ మంజుల, జిల్లా నాయకులు కొనతం నాగార్జున రెడ్డి, గౌరు శ్రీనివాస్ , కూరాకుల వెంకన్న, పోచం సోమయ్య, పట్టణ నాయకులు చేకూరి మల్లేశం, కందుకూరి ప్రకాష్, ముత్తినేని తిరుమలేష్, యేష బోయిన రమణ, బద్ద మహేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.