Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి మాధవరం కాంతారావు డిమాండ్

ముద్ర కూకట్‌పల్లి :
అవినీతి, అరాచక పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలని నిజామాబాద్ జిల్లా మరియు కూకట్‌పల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చిన ‘అసెంబ్లీ ముట్టడి’ కార్యక్రమానికి వెళ్లకుండా, ఈ రోజు ఉదయం కూకట్‌పల్లి పోలీసులు ఆయనను ముందస్తు అరెస్టు చేశారు.
​ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులవుతున్నా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. హామీల అమలును పక్కన పెట్టి, రకరకాల పన్నులు పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు.​శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నారని,ఎన్ని అరెస్టులు చేసినా ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు

Leave A Reply

Your email address will not be published.