Take a fresh look at your lifestyle.

నేతాజీ నగర్ కాలనీలో ఘనంగా స్వాతంత్య్ర దిన వేడుకలు

ముద్ర, హైదరాబాద్: మెహిదీపట్నం సమీపంలోని నేతాజీ నగర్ కాలనీలో శనివారం నాడు స్వాతంత్ర్య దిన వేడుకలు ఘనంగా జరిగాయి. నేతాజీ పార్క్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జి అప్పారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు టీఎస్ ఆనంద్ రెడ్డి, ఖాలిద్ సర్వర్, వై నరేందర్ రెడ్డి, ఏ కృష్ణమూర్తి, రమా దేవి, రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ( ఎలక్ట్రికల్) చంద్రమోహన్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యాన్ని సమపార్జించడంలో అనేక త్యాగాలు చేసిన వారికి నివాళులు అర్పించి వారి మార్గదర్శకత్వంలో నడవడం మన కర్తవ్యమని అన్నారు.


రాజ్యాంగం ప్రసాదించిన హక్కులతో పాటు బాధ్యతలను కూడా నిర్వహించినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ పరిపుష్టమవుతుందని అన్నారు. దేశం గత 80 ఏళ్లలో ఎంతో ప్రగతిని సాధించినప్పటికీ స్వాతంత్ర ఫలాలు ఇంకా అందరికీ పూర్తిగా అందకపోవడం దురదృష్టకరమని అన్నారు. రాజకీయాలు ధనమయం కావడం విచారకమని పేర్కొంటూ ఆ పరిస్థితి పోవడానికి యువత కృషి చేయవలసిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. దేశ స్వాతంత్ర సముపార్జనకు ప్రాణ త్యాగం చేసిన అమరులకు, రాజ్యాంగ రూపకర్తలకు వారు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో కేవీబీ మురళీమోహన్ రావు, ఎంవీ రంగారెడ్డి, మహమ్మద్ అబ్దుల్ మాలిక్, ఫక్రుద్దీన్,


డాక్టర్ జనార్ధన్, పి గంగాధరన్, డాక్టర్ వరప్రసాదరావు, దామోదర్, ఎం అంజనేయస్వామి, శ్రీనివాస్, పి రామేశ్వర్ రెడ్డి, సంజీవరెడ్డి, శ్రీనివాసరావు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.