- ఇంచార్జ్ రాజా రమేష్.
రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : నిరుపేద కుటుంబాలకు చెందిన అర్హులకే డబుల్ బెడ్రూం ఇండ్లను ఇవ్వాలని బీఆర్ఎస్ చెన్నూరు నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్ డిమాండ్ చేశారు.ఇటీవల విడుదల చేసిన అర్హుల జాబితాలో అవకతవకలు జరిగాయని పట్టణ అధ్యక్షుడు కంబగోని సుదర్శన్ గౌడ్ ఆరోపించారు.స్థానిక సూపర్ బజార్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంపిక చేసిన వారికి కాకుండా కొత్త వారిని అర్హులను చేయడంపై తప్పు పట్టారు.సొంత ఇళ్లతో పాటు పట్టాలు పొందిన వారిని ఎలా అర్హులను చేశారని ప్రశ్నించారు.ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకొని కొందరి పేర్లను అర్హుల లిస్టులో ఉంచారన్నారు.పేద ప్రజల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులైన పేదలకు దక్కకుండా చేస్తున్న లీడర్లపై అసహనం వ్యక్తం చేశారు.ఇప్పటికైనా పేద కుటుంబాలకు చెందిన అర్హులను ఉన్నత అధికారులు గుర్తించి వారికి ఇండ్లను అందించాలని కోరారు. అవసరమైతే అర్హులైన పేదలతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో సీనియర్ నాయకులు రామిడి కుమార్,బడికెల సంపత్,మాజీ కౌన్సిలర్లు రేవెల్లి ఓదెలు,జిలకర మహేష్,అలుగల సత్తయ్య,పారిపెల్లి తిరుపతి,గడ్డం రాజు,అనిల్ రావు, భూమన్న గౌడ్,యువ నాయకులు లక్ష్మీకాంత్,కుమార్,కరుణాకర్,సంతోష్, చంద్ర కిరణ్,సాయి కృష్ణ,దినేష్,ఖలీమ్ తదితరులు పాల్గొన్నారు.