మంథని, ముద్ర: మహిళలు తమ హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని అప్పుడే ధైర్యంగా ముందుకు పోవచ్చని మంథని అడిషనల్ సివిల్ జడ్జి మూల స్వాతిగౌడ్ అన్నారు.మంథని కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ద్వితీయ శ్రేణి మెజిస్ట్రేట్ బి.అనురాధతో కలిసి పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భం గా రాజీ మార్గం ద్వారా పలు కేసులు పరిష్కరించారు.మొత్తం 650 కేసులు పరిష్కరించి రూ.17,46,060 జరిమానా వసూలు చేశారు.కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కె.రఘోత్తం రెడ్డి, ఏపీపీ సందీప్, ఏజీపీ బి.ఆంజనేయులు, సి.ఐ.లు బి.రాజు, ప్రసాద్ రావు, ఎస్.ఐలు డేగ రమేశ్, పి.చంద్రకుమార్, గోపతి నరేశ్, కొట్టె ప్రసాద్, న్యాయవాదులు సుబాష్, విజయ్ కుమార్, శశిభూషణ్ కాచే, భాగ్య, రాచెర్ల రాజేందర్ పాల్గొన్నారు.