ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
జోగిపేటలో జరుగుతున్న జోగినాథస్వామి రథోత్సవ ఉత్సవాలలో భాగంగా మంగళవారం రోజు జరిగిన శివపార్వతుల కళ్యాణోత్సవానికి రాష్ట్ర మంత్రి దామోదర్ రాజ నర్సింహ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన ఆలయంలో స్వామీ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈకార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పాండు,అందోల్ తహసీల్దార్ మధుకర్ రెడ్డి, జోగిపేట సీఐ అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేరి జగన్మోహన్ రెడ్డి, జోగిపేట మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ, కౌన్సిలర్లు కొషికే రాజశేఖర్, తోట్ల రామకృష్ణ, ప్రదీప్ గౌడ్,మాజీ కౌన్సిలర్లు పట్లోళ్ల ప్రవీణ్ కుమార్, శరత్ బాబు, రంగా సురేష్, మాజీ ఎంపీపీ రామా గౌడ్, చాపల వెంకటేశం, 13వ వార్డు కౌన్సిలర్ పట్లూరి శివశేఖర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు డాకూరి వెంకటేశం, మాజీ కౌన్సిలర్ డాకూరి శివశంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య గుర్రం కృష్ణ, మాజీ కో ఆప్షన్ సభ్యులు అల్లే శ్రీకాంత్, చిట్యాల మధు ఉలువల రాజు, కుమ్మరి భాస్కర్ స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.