Take a fresh look at your lifestyle.

ఏప్రిల్ 2న పాపన్న గౌడ్ వర్ధంతి – అధ్యక్షులు పల్లె బాలకిషన్ గౌడ్

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 316వ వర్ధంతి ఏప్రిల్ 2 గురువారం ఉదయం నిర్వహించడం జరుగుతుందని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అసోసియేషన్ అధ్యక్షులు పల్లె బాలకిషన్ గౌడ్ చెప్పారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిద్దిపేటలోని పాపన్న గౌడ్ చౌరస్తాలోని పాపన్న గౌడ్ విగ్రహాం వద్దా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఇట్టి కార్యక్రమానికి గౌడ కుటుంబ సభ్యులతో పాటు బహుజన వాదులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పల్లె అనిల్ గౌడ్, ముండ్రాతి రాజు గౌడ్, రామంచ మల్లేశం గౌడ్, బోల్గం అంజయ్య గౌడ్, గడ్డమిది యాదగిరిగౌడ్, గుర్రం బాల్ రాజు గౌడ్, అంబటి ప్రకాష్ గౌడ్, గాదగోని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.