Take a fresh look at your lifestyle.

ప్రపంచం మొత్తం మారుతున్న మహిళా వివక్షలో మార్పు లేదు. సంఘటిత పోరాటాలతోనే సమాన హక్కులు,వేతనాలు సాధించాలి. CITU జిల్లా ఉపాధ్యక్షులు మారెళ్ళ శ్రీలత

 

ఈరోజు ముకుంద లాల్ మిశ్ర భవన్లో CITU,SFI,DYFI ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ జిల్లా సదస్సు నిర్వహించారు.CITU జిల్లా ఉపాధ్యక్షులు మారెళ్ళ శ్రీలత మాట్లాడుతూ దేశ జనాభాలో 48 %గా ఉన్న మహిళల విద్య ,ఆరోగ్యం,ఆర్థిక అభివృద్ది,భద్రత తదితర అంశాలు పరిశీలిస్తే మహిళా వివక్ష స్పష్టంగా కనిపిస్తుంది.

భారత దేశ ఆర్థికఅభివృద్ది లో మహిళా భాగస్వామ్యం లేకుంటే అసంపూర్ణ కథ చిత్రం గా మారుతుంది. దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో మహిళ వాటా 18% గా ఉన్న మహిళ సాధికారత లోపం, వివక్ష బీజేపీ ప్రభుత్వం చూపిస్తుంది.

భారతీయ సంస్కృతి లో గొప్ప స్థానం ఉందని చెప్పిన ఆచరణలో తీవ్రస్థాయిలో దురాచారాలు,అకృత్యాలు, మహిళల మీద బిన్న రూపాల్లో దాడులు జరుగుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం 4.45 లక్షల నేరాలు జరిగాయని నివేదిక తెలిపింది. ఎటువంటి జీతం భత్యాలు లేని మహిళలు పురుషుల కంటే పది రెట్లు ఎక్కువ ఉన్నారు. సమాన పనికి సమాన వేతనం,సమాన హక్కులు,పని ప్రదేశాలలో రక్షణ,సెలవులు,ఉచిత న్యాయ సహాయం,పని భద్రత లేకుండా నాలుగు లేబర్ కోడ్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.

మహిళా ప్రజా ప్రతినిధుల నుండి మొదలుపెడితే కింది అసంఘటిత రంగ కార్మికులకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.అందుకని శ్రామిక మహిళ లోకం,ప్రజలు కలిసి సంఘటిత ఉద్యమాలు నిరంతరం కొనసాగుతుందని తెలియచేశారు.


ఈ కార్యక్రమంలో CITU జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల రమేష్,జిల్లా సహాయ కార్యదర్శి పున్నం రవి,SFI గర్ల్స్ కన్వీనర్ ఉప్పునూటి మానస, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహిళా కన్వీనర్ ముక్కెర బుజ్జమ్మ,శాతవాహన యూనివర్సిటీ మహిళా కన్వీనర్ దయమని,ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కాల్వ సారిక,జిల్లా ఉపాధ్యక్షులు నాగెల్లి పద్మ, బాయిని ప్రియంక,బూడిద రజిత,సహాయ కార్యదర్శిలు సరిత,స్వరూప, సుమలత తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.