Take a fresh look at your lifestyle.

టీజీ ఐసెట్ కోసం టి-సాట్ స్పెషల్ డిజిటల్ లెసన్స్-• సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి

• ఫిబ్రవరి 23వ తేది నుండి ప్రసారాలు
• 80 రోజులు 320 ఎపిసోడ్స్

ముద్ర, శేరిలింగంపల్లి :

పలు పోటీ పరీక్షలకు డిజిటల్ లెసన్స్ అందిస్తోన్న టి-సాట్ నెట్వర్క్ తెలంగాణ ఐసెట్ 2026 పరీక్షలకు సైతం డిటిటల్ లెసన్స్ అందిస్తోందని సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. తెలంగాణ లోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే ఎం.బి.ఎ మరియు ఎం.సి.ఎ అర్హత పరీక్ష ఐసెట్ కోసం ఫిబ్రవరి 23వ తేది సోమవారం నుండి ప్రసారాలు మొదలౌతాయన్నారు. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2026 మే 13,14వ తేదీన జరగనుండగా ఎనలిటిక్ ఎబిలిటీ, మాథమెటిక్స్, కమ్యూనికేషన్ ఎబిలిటీ తదితర సబ్జెక్టులపై రోజుకు రెండు సబ్జెక్టుల చొప్పున ప్రసారం చేయనున్నామని, విద్యా ఛానల్ లో ఉదయం ఐదు నుండి ఆరు గంటల వరకు, నిపుణ ఛానల్ లో సాయంత్రం ఐదు నుండి ఆరు గంటల వరకు డిజిటల్ లెసన్స్ ప్రసామౌతాయని సీఈవో వివరించారు. తెలంగాణాలోని విద్యార్థులు టి-సాట్ డిజిటల్ లెసన్స్ సద్వినియోగం చేసుకోవాలని సీఈవో వేణుగోపాల్ రెడ్డి సూచించారు.

Leave A Reply

Your email address will not be published.