Take a fresh look at your lifestyle.

హాఫీజ్ పేట్ ఇఫ్తార్ విందులో పాల్గొన్న పీయేసీ ఛైర్మన్ అరికపూడి గాంధీ

ముద్ర, శేరిలింగంపల్లి:
రంజాన్ మాసం పర్వదినం ను పురస్కరించుకుని హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని యూత్ కాలనీ లో నిర్వహించిన దవాత్- ఏ – ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా చైర్మన్ గాంధీ మాట్లాడుతూ రంజాన్ మాసం చాలా పవిత్రమైనది అని, రంజాన్ సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దెైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రంజాన్ పర్వదినం ను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు ఇవ్వడం చాలా అభినదించదగ్గ విషయం అని అదేవిధంగా తెలంగాణకు ప్రత్యేకమైన “గంగా జమునా తెహజీబ్” మరింతగా పరిఢవిల్లాలని, రంజాన్ పండుగ ప్రజా జీవితాల్లో సుఖ సంతోషాలను అందించాలని చైర్మన్ గాంధీ అభిలషించారు. రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించేందుకు మసీదులకు ఈద్గాల అభివృద్ధి, మరమ్మతులకు నిధులు కేటాయించడమే కాకుండా పండుగ సందర్భంగా పేదలకు దుస్తులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కుల మతం జాతి భేదం లేకుండా తెలంగాణ జాతి అంతా ఒకటే అని, ఆ దేవుడి కరుణ కటాక్షాలు పొందేందుకు దేవుడి కృపకు దగ్గర కాగలమనేది ప్రతి ముస్లిం సోదరుల ప్రగాఢ విశ్వాసమని, అందుకే ఎంతో భక్తి శ్రద్ధలతో రంజాన్ నెల మాసాన్ని పురస్కరించుకుని నియమ నిబంధనలు పాటించి ఉపవాస కఠోర దీక్షతో ప్రార్థనలు చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అక్తర్, చాంద్ పాషా, మన్సూర్, రాము, అన్వర్, తైసిన్, కాజా, అజార్, మరియు ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.