ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
భారత జనాభా గణన- 2027లో అందరూ భాగస్వాములు కావాలని గద్వాల డీటీ అజిత్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం గద్వాల పట్టణంలో జనగణన (Census) 2027 పై అవగాహన కార్యక్రమం అధికారుల నిర్వహించారు. ఈ సందర్భంగా గద్వాల తహసీల్దార్ కార్యాలయం నుంచి గద్వాల పురవీధుల గుండా ర్యాలీ నిర్వహింవారు. అనంతరం
దేశాభివృద్ధిలో జనగణన యొక్క ప్రాముఖ్యతను మరియు ప్రతి పౌరుడి వివరాలు నమోదు కావాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా ఈ సందర్భంగా డీటీ అజిత్ వివరించారు .
ప్రజలు తమంతట తామే ఆన్‌లైన్ ద్వారా వివరాలను నమోదు చేసుకునే ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’ విధానంపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు.
పౌరులందరూ ఈ జనగణన ప్రక్రియలో భాగస్వాములు కావాలని, స్వయం గణన పద్ధతిని వినియోగించుకుని వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని కోరారు. ప్రభుత్వ పథకాల రూపకల్పనకు మరియు ప్రాంతీయ అభివృద్ధికి ఈ గణాంకాలు ఎంతో కీలకమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, పంచాయతీ కార్యదర్శులు మరియు రేషన్ షాపు,డీలర్లు తదితరులు పాల్గొన్నారు.