ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
గద్వాల జిల్లా కేంద్రంలోని పలు మద్యం దుకాణల వద్ద తెల్లవారకముందే మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లా ఎక్సైజ్ శాఖ కూత వేటు దూరంలో ఉన్న మద్యం దుకాణాల వద్ద మద్యం విక్రయిస్తున్న ఎక్సైజ్ అధికారులకు దృష్టి సారించకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. జిల్లా కేంద్రంలో పాత కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న ఓ మద్యంషాపు అలాగే మేలచెర్వు చౌరస్తా లో ఉన్న ఓ మద్యం షాపు వద్ద నిబంధనల విరుద్దంగా ఫర్మిట్‌రూం ల్లో తెల్లవారుజామున నుంచే మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్నారు. పర్మిట్ రూమ్ ల చాటున నిర్వాహకులు బహిరంగానే మద్యం విక్రయాలు పాల్పడుతున్న ఎజ్సైజ్ అధికారులు ఎవరూ అట్టు వైపు తనిఖీలు చేసిన పాపాన పోలేదన్నా విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్దంగా ఫర్మిట్ రూం ల వద్ద మద్యం విక్రయాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు అధికారులను కోరుతున్నారు.
Swapna is a Web Admin and She is working with our organisation and She has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.