Take a fresh look at your lifestyle.

అధైర్య పడవద్దు…. ఆదుకుంటాం -బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్

 

ముద్ర,కుత్బుల్లాపూర్ :

బాచుపల్లి ప్రధాన రహదారిలోని కేజీఆర్ కన్వెన్షన్ వద్ద గల బాచుపల్లి ప్రధాన రహదారి పక్కన గల ఫర్నిచర్ దుకాణాలలో అర్ధరాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంతో రోడ్డున పడ్డ ఫర్నిచర్ షాప్ బాధితులను, సంఘటన స్థలాన్ని బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ పరామర్శించి బాధితులను ఓదార్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. జీవనోపాధి కోసం చిన్న చిన్న దుకాణాలను ఏర్పాటుచేసి వ్యాపారాలు నిర్వహిస్తున్న వీరికి ఇలాంటి ఆకస్మాత్తు ప్రమాదాలు తీవ్ర ఆస్తి నష్టాన్ని కలిగించాయని, జిల్లా ఉన్నతాధికారులతో ఘటనఫై చర్చించి బాధితులకు నష్టపరిహారం అందేలా చర్యలు చేపట్టి వారిని అందుకుంటామన్నారు.


ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ధన్ రాజ్ యాదవ్, పార్టీ అధ్యక్షులు రంగారాయ ప్రసాద్, మాజీ కార్పొరేటర్ రవికిరణ్, గాజుల సుజాత, స్థానిక నాయకులు సాంబశివరెడ్డి, శ్రీకర్ గుప్తా, ప్రదీప్, వైఎస్, కురుమూర్తి, అంజన్ కుమార్, రవీందర్ బాబు, జయరాజ్, మహిళా నాయకురాలు లలితా రెడ్డి, క్రిష్ణ మంజరి తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.