ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
పేదల నిత్యావసరల ధరలు తగ్గించాలని 9వ వార్డు ఇంద్రమ్మ కాలనీ సింగన్నగూడెం వద్ద సిపిఐఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సిపిఐఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ మాట్లాడుతూ రోజు రోజుకు నిత్యవసర ధరలు పెరుగుతూ పేదల ప్రజలు రోజు పనికి పోయే కార్మికుల పై ధరలు ఇష్టం వచ్చినట్లు పెంచుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల రక్తాన్ని పిలుస్తున్నాయని చెప్పారు. కార్పొరేషన్ శక్తులకే మద్దతు తెలుపుతూ సామాన్య ప్రజలకు నిత్యవసర ధరలు పప్పులు నూనెలు సబ్బులు జిఎస్టి తగ్గిస్తున్నానని చెప్తూ గొప్పలు చెప్తున్నా నరేంద్ర మోడీ ఈ పేదవాళ్ల తినుబండారాలు పెరుగుతుంటే కనిపించడం లేదా ధరలను అదుపు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యవర్గ సభ్యులు గంధ మల్ల మాతయ్య, పట్టణ నాయకులు కొలుపుల కృష్ణ,
చింతల శివ, కుచ్చుల నరసింహ, నోముల లక్ష్మి, హేమలత పాల్గొన్నారు
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Next Post