Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి – దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

……………………………………..
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్,జిల్లా ప్రతినిధి:
………………………………………
రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్ని శాఖల అధికారులకు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆదేశించారు.


శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ లో ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజాపాలనలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చిన హామీలు రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతి, మహిళలకు రూ.500 సబ్సిదీ పై గ్యాస్ సిలిండర్, మహాలక్ష్మి పథకంతో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం జరిగిందన్నారు. ఇవేకాక రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం ఇస్తున్నామని, ఇందిరా మహిళాశక్తి, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పూర్తి పారదర్శకంగా లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే వెల్లడించారు. జూన్2 నుంచి రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు చేయబోతున్నదని, కొత్తగా రెండు లక్షల పింఛన్లు ఇచ్చేందుకుసన్నాహాలు చేస్తున్నదన్నారు. ముఖ్యంగా ప్రజా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కల్పించాల్సిందిగా అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఖుష్బు గుప్తా , జిల్లా ఎస్పీ జానకి, మేయర్ గుమ్మల మమత , ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ , మార్కెట్ యార్డ్ చైర్మన్ బెక్కరి అనిత , భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బాలకోటి, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.