- ప్రమాదవసాత్తు మరణించిన కుటుంబానికి అండగా ఉంటాం.
- యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్.
కోరుట్ల, ముద్ర విలేకరి: జగిత్యాల జిల్లాలో ప్రమాదవశాత్తు మరణించిన ప్రతి నిరుపేద యాదవ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి యాదవులందరం అండగా ఉంటామని యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామానికి చెందిన మాధం నాగరాజు యాదవ్ ఇటీవల ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో మరణించగా గురువారం రోజు గొర్రెపల్లి గ్రామంలో వారి నివాసానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులకు యాదవ సంఘం అడహాక్ కమిటీ సభ్యులు 53 వేల 116 ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్బంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ వారి మృతుని కుమార్తెకు 1వ తరగతి నుండి పదవ తరగతి వరకు కరీంనగర్ లోని ప్రైవేట్ పాఠశాల, హాస్టల్ వసతితో సహా ఉచితంగా చదివించడానికి సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘ నాయకులు తొట్ల చిన్నయ్య, తిప్పనవేని రవి, చెరుకు సుభాష్, గుడిసె జితేందర్, మ్యాదరవేని రామాంజనేయులు, ముక్కెర లింబాద్రి, తదితరులు పాల్గొన్నారు.