- సద్వినియోగం చేసుకోవాలన్న ఎస్పీ రోహిత్ రాజ్.
ముద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో: ఈ నెల 6, 7 తేదీల్లో భద్రాచలంలో జరగనున్న శ్రీరామ నవమి, పట్టాభిషేక మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా పోలీసులు ఒక క్యూఆర్ కోడ్ తో పాటు ఆన్ లైన్ లింకును ( https://bhadrachalam.netlify.app ) రూపొందించింది. వీటి ద్వారా పార్కింగ్ స్థలాలు, కళ్యాణ మంటపం, సెక్టార్లు, లడ్డూ, తలంబ్రాల కౌంటర్ల వద్దకు భక్తులు సులభంగా చేరుకోవొచ్చు.అదే విధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు2000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.అందులో భాగంగానే ఒక క్యూఆర్ కోడ్ ను, ఆన్లైన్ లింకును రూపొందించామని చెప్పారు.ఆన్లైన్ లింకు ద్వారా నవమి, పట్టాభిషేక మహోత్సవాలకు భద్రాచలం వచ్చే భక్తులు వారు చేరుకోవాల్సిన స్థలాలకు సులభంగా చేరుకోవచ్చని తెలిపారు.రెండు రోజులు పాటు పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్త కుండా పోలీసులు విధించే ఆంక్షలకు భద్రాచలం పట్టణ, పరిసర ప్రాంత ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
