Take a fresh look at your lifestyle.

జిల్లాలో బ్రూణహత్యలను పూర్తి నిర్మూలనకై విస్తృత అవగాహన కార్యక్రమాలు : జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ ఎం. మనోహర్

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
జిల్లాలో బ్రూణహత్యలను పూర్తిగా నిర్మూలనకై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ ఎం. మనోహర్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కార్యాలయంలో జరిగిన
జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో బ్రూణహత్యలను పూర్తిగా నిర్మూలించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ గ్రామ స్థాయి వరకు విస్తృత అవగాహన కార్యక్రమాలు, గర్భిణీల పర్యవేక్షణ, అల్ట్రాసౌండ్ కేంద్రాల తనిఖీలు, రికార్డుల సమగ్ర పరిశీలన, సి-సెక్షన్ (ఫారం ఎఫ్) ఆడిట్ నిర్వహణ చర్యలను క్రమం తప్పకుండా అమలు చేస్తున్నట్లు తెలిపారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, ప్రచారం చేయడం, సహకరించడం వంటి చర్యలు చట్టవిరుద్ధమన్నారు. అలాంటి వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలో ఎవరు అయినా బ్రూణహత్యలు, అక్రమ గర్భస్రావాలు నిర్వహించినట్లయితే, సంబంధితులపై మెడికల్ టెరమినేషన్ అఫ్ ప్రెగ్నన్సీ యాక్ట్, ప్రి- కాన్సెప్షన్, ప్రి-నాటల్ డైగ్నోస్టిక్ టెక్నిక్యూస్ యాక్ట్ ప్రకారం తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. రికార్డులు సక్రమంగా నిర్వహించని కేంద్రాలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ సమావేశంలో కమిటీ సభ్యులు డాక్టర్లు యల్.యశోద, ఎ.వీణ, నిర్మల, శ్రీదేవి, అరుదతి, నాగరాజు, శివలింగం, యస్.కే తాజుద్దిన్, సాయి రెడ్డి పాల్గొన్నారు. జిల్లాలో లింగ సమానత్వం సాధనకు, బాలికల పరిరక్షణకు సమాజంలోని ప్రతి వర్గం సహకరించాలని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.