- బహవల్‌పూర్, మురిడ్కే, గుల్పూర్, సవాయి, కోట్లి, సర్జల్, బర్నాలా, మెహమూనా ప్రాంతాలపై ఇండియన్ ఆర్మీ అటాక్ చేసింది.
- బహవల్‌పూర్ జైషే ప్రధాన కార్యాలయంగా, ప్రధాన దాడులకు ప్రణాళికా కేంద్రంగా ఉండేదని రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
- మురిద్కే ముంబైపై 26/11 దాడులకు పాల్పడిన ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన లష్కరే స్థావరం.
- 2023, 2024 మధ్య జమ్మూ కశ్మీర్ లోని రాజౌరి, పూంచ్ లలో దాడులకు గుల్పూర్ స్థావరంగా ఉంది.
- సవాయి శిబిరం.. పహల్గామ్ ఉగ్రదాడితో సహా భారతదేశంలో జరిగిన పలు దాడులతో సంబంధం ఉన్న లష్కర్ శిబిరం.
- కోట్లీ ఉగ్రవాద శిక్షణా కేంద్రంగా ఉంది.
- సర్జల్, బర్నాలా ఎల్‌ఓసి, అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గరగా ఉండే ఉగ్రవాద శిబిరాలు.చొరబాటు కోసం ఉపయోగిస్తుంటారు.
- మెహమూనా హిజ్బుల్ ముజాహిదీన్ ప్రధాన శిబిరం