Take a fresh look at your lifestyle.

బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు స్ఫూర్తిదాయకం

ముద్ర కూకట్‌పల్లి :
భారత మాజీ ఉప ప్రధాని, సామాజిక న్యాయ పోరాట యోధుడు బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు మూసాపేట్ గూడ్స్‌ షెడ్‌ రోడ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై, జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, భారత రాజకీయ చరిత్రలో సామాన్య ప్రజల పక్షాన నిలిచి అలుపెరగని పోరాటం చేసిన గొప్ప నేత బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. దేశ నిర్మాణంలో, సామాజిక సమానత్వం కోసం ఆయన అందించిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు నేటి యువతకు మార్గదర్శకమని, ముఖ్యంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి ప్రశంసనీయమని వడ్డేపల్లి రాజేశ్వరరావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని పలు దళిత సంఘాల నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబూజీకి నివాళులు అర్పించారు.

Leave A Reply

Your email address will not be published.