Take a fresh look at your lifestyle.

గాంధి మార్గంలోనే ఉద్యమిస్తున్నాము : పూస శ్రీనివాస్

ముద్ర, భువనగిరి ప్రతినిధి :
తెలంగాణ ఉద్యమాన్ని అన్ని మార్గాల్లో చేసి తెగించి కొట్లాడిన ఉద్యమకారులందరు నేడు గాంధి మార్గములోనే ఉద్యమిస్తున్నారని ఉద్యమకారులకు ఇచ్చిన హామిలు వెంటనే నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూస శ్రీనివాస్ కోరారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగిన “నిరసన దీక్ష”లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రం కోసం ధర్నాలు, రైలు రోకోలు చేశామని ఉద్యమకారులకు కాంగ్రెస్ మానిఫెస్టోలో పెట్టిన విధంగా 250 చ.గజాల స్థలము, రూ॥ 30,000 పెన్షన్, ఆరోగ్య కార్డు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో మెరుగు మధు, డి.ఎస్. మాణిక్యమ్మ, గొర్ల లక్ష్మణ్, గోపరాజు గణేష్, మంతపురం వినోద్కుమార్, సుధాకర్, రమేష్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.