కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బందుల పడుతున్నారు మార్కెట్ యార్డును సందర్శించిన ఎమ్మెల్యే-సిద్దిపేట ఎమ్మెల్యే హరిశ్ రావు
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ నీ సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుసందర్శించారు. ఈ సందర్బంగా పొద్దు తిరుగుడు, మొక్కజొన్న ధాన్యం ను నాలుగు రోజుల నుండి కొనుగోలు చేయడం లేదని హరిశ్ రావుకు రైతులు తెలిపారు. అధికారులతో పోన్ లో మాట్లాడిన హరీశ్ రావు అగ్రహం వ్యక్తం చేశారు.వెంటనే మార్కెట్ యార్డ్ నీ సందర్శించి సమస్య పరిష్కరించాలని ఆదేసించారు ఎమ్మెల్యే మాట్లాడుతు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతుల ఇబ్బంది పడుతున్నారన్నారు.
రైతుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు. నారాయణ కేడ్, ఆదిలాబాద్,నిజామాబాద్ కేంద్రాల్లో జొన్న కొనుగోలు సెంటర్ లు ప్రారంభం చేయలేదు, వెంటనే కొనుగోలు సెంటర్ లు ప్రారంభం చేసి మద్దతు ధర ఇవ్వాలన్నారు.
చాలా చోట్ల కొనుగోలు సెంటర్ లు ప్రారంభం చేయక రైతులు పంటని తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోతున్నారన్నారు.
రేవంత్ రెడ్డి పంట మార్పిడి చేయమని చెబుతున్నారు కానీ రైతులు పంట మార్పిడి చేస్తే వాటిని కొనే దిక్కు లేదని మండిపడ్డారు. పలు జిల్లాల లో వడగళ్ల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. రైతులకు సమయానికి రైతు బంధు ఇవ్వాలన్నారు.పూలే జయంతీ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు- బీసీ డిక్లరేషన్ పేరిట రేవంత్ రెడ్డి బీసీ లను మోసం చేశారనారు.కేసీఆర్ అన్ని కుల వృత్తులను ప్రోత్సహించారు
బీసీ లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగా చేసిందన్నారు.బీసీ విద్యార్థుల పీజూ రియాంబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలన్నారు.