- ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి.
ముద్ర ప్రతినిధి, కల్వకుర్తి : ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యాన్ని దళారులకు తక్కువ ధరలకు విక్రయించడం ద్వారా రైతులు నష్టపోతున్నందున ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేస్తూ ఆర్థిక తోడ్పాటును అందించడం జరుగుతుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.గురువారం కల్వకుర్తి మండలం మార్చాల, పంజుగుల , ముకురాల లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు.రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించడం వల్ల ప్రభుత్వం రూ,500 ప్రోత్సహకాన్ని అందించడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.వ్యవసాయ రంగాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేయడం జరుగుతుందని రానున్న రోజుల్లో సాగుకు మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి. నాయకులు అశోక్ రెడ్డి, ఆనంద్ కుమార్, జగన్ ,సంజీవ్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, రాములు, రమాకాంత్ రెడ్డి, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు పాల్గొన్నారు.