Take a fresh look at your lifestyle.

వీధి ఆహార విక్రేతలకు నిర్వహణ పద్దతులపై ప్రత్యేక శిక్షణ జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్

ముద్ర, శేరిలింగంపల్లి:
వీధుల్లో ఆహార పదార్థాలు అమ్మే వారికి ఆహార నిర్వహణపై పూర్తి స్థాయి అవగాహణ ఉండాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ సూచించారు. ఫుడ్ సేఫ్టీ చట్టంలో భాగంగా శేరిలింగంపల్లి పరిధిలోని వీధి ఆహార విక్రేతలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ నారయణ్ అమిత్ మాట్లాడుతూ ఆహార విక్రేతలు ఆదాయం గురించి మాత్రమే ఆలోచించకుండా వినియోగదారుల ఆరోగ్యం పట్ల ఆలోచించాలని సూచించారు. నాణ్యతతో పాటు శుభ్రతను పాటించాలని, అలా పాటించే విధంగా వివిధ శాఖల అధికారులు చొరవ చూపాలన్నారు. ఆహార పదార్థాల కల్తీ వల్ల జరిగే పరిణామాలకు నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాలని సూచించారు. శిక్షణ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సుభద్రాదేవి ఆధ్వర్యంలో జోన్ ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం, 2006 నిబంధనల ప్రకారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో సుమారు 110 మంది వీధి ఫుడ్ విక్రేతలు పాల్గొన్నారు.
ఫుడ్ సేఫ్టీ సూపర్ వైజర్స్ కార్యక్రమ విజయవంతానికి సహకరించగా విక్రేతలకు హైజీన్ కిట్లు పంపిణీ చేశారు. సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.