ముద్ర,వనపర్తి:
జిల్లా కేంద్రంలోని ఈవీఎంలు భద్రపరిచిన గోదాము కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం ఆర్డీవో కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాములోని ఈవీఎం లను త్రైమాసిక తనిఖీలో భాగంగా జిల్లా కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లపై సిబ్బందిని అడిగి తెల్సుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీప్యాట్ గోదాం తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగానే శుక్రవారం గోదాంలోని ఈవీఎంలను త్రైమాసిక తనిఖీ చేసినట్లు చెప్పారు. అనంతరం గోదాం వద్ద సిబ్బంది హాజరు తీరుపై ఆరా తీశారు. గోదాం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, రెవెన్యూ అధికారులు చక్రపాణి, సీ సెక్షన్ సిబ్బంది రాజేష్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు టిడిపి నుంచి లక్ష్మయ్య, శంకర్, కాంగ్రెస్ నుంచి వేనా చారి, సిపిఎం నుంచి పరమేశ్వర్ చారి, బీజేపీ నుంచి కుమారస్వామి, ఆంజనేయులు, బీ ఆర్ ఎస్ నుంచి గట్టు యాదవ్, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.