Take a fresh look at your lifestyle.

గ్యాస్ ఏజెన్సీలతో అదనపు కలెక్టర్ నగేష్ సమీక్ష

ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లాలో గల గ్యాస్ ఏజెన్సీలు, పౌరసరఫరాల అధికారులతో అదనపు కలెక్టర్ నగేష్ సమీక్షించారు.
జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గ్యాస్ బుక్ చేసుకున్న రెండు, మూడు రోజుల్లోనే వినియోగదారులకు సకాలంలో డెలివరీ చేయడం జరుగుతుందని తెలిపారు. కమర్షియల్ సరఫరాలో ఏర్పడిన కొరతను అధిగమించేందుకు ఉపశమనం వైపు చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని తెలిపారు. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ ను ఎవరైనా కమర్షియల్ గా వాడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గృహ అవసరాలకు వినియోగించే ఎల్పిజి గ్యాస్ సరఫరాలో ఎలాంటి కొరతలేనందున ప్రజలు ఆందోళనకు గురై అనవసరంగా గ్యాస్ బుక్ చేసుకోవద్దని కోరారు. సమీక్షలో జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్ సంబంధిత గ్యాస్ ఏజెన్సీ ‌ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.