రత్నాకర్ రావు విగ్రహానికి పూలమాలలు చేసి నివాళులర్పించిన జువ్వాడి బ్రదర్స్….
వర్ధంతి సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు అన్నదాన కార్యక్రమం….
ముద్ర, కోరుట్ల;
స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు 6వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని కోరుట్ల పట్టణ వెటర్నరీ కళాశాల వద్ద ఉన్న జువ్వాడి రత్నాకర్ రావు విగ్రహనికి కోరుట్ల మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత గంగాధర్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర వేలమ సంక్షేమ శాఖ కార్పొరేషన్ చైర్మన్ కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు, శేఖర రావు లు విచ్చేశారు. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తల తో కలిసి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోరుట్ల నియోజకవర్గ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయులుగా నిలిచిపోయిన గొప్ప వ్యక్తి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు అని కొనియాడారు. అనంతరం వారు మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందంటే రత్నాకర్ రావు చేసిన అభివృద్ధి తప్ప గడచిన 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యం అన్నారు. వెటర్నరీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి అని అన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో కోరుట్ల పట్టణానికి సుమారు 4500 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు తో మాదాపూర్ కాలనీ, అర్బన్ కాలనీ, ఏసుకొని గుట్ట, అల్లమయ్య గుట్ట లాంటి కాలనీలు ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి రత్నాకర్ రావు అని కొనియాడారు. గడచిన 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో కేవలం కోరుట్ల పట్టణంలో 80 డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మాత్రమే నిర్మించారని అవి కూడా వారికి అనుకూలంగా ఉన్నవారికి అప్పగించారే తప్ప అర్హులైన ఏ ఒక్కరికి కూడా అందించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మహాలక్ష్మి పథకం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకె గ్యాస్ సిలిండర్, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేశామని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కోరుట్ల నియోజకవర్గానికి ఇప్పటివరకు 3500 ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు అందజేయడం జరిగిందన్నారు. ప్రోసిడింగ్ పత్రాలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇంటి నిర్మాణాలు త్వరగా చేపట్టుకోవాలని అన్నారు. అనారోగ్య సమస్య వల్ల ఆస్పత్రిలో చేరి వైద్యం కోసం ఖర్చు చేసిన డబ్బులను ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అధిక మొత్తంలో అందజేయడం జరుగుతుందన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మున్సిపల్ కార్మికులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వేలమ కార్పొరేషన్ చైర్మన్ కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు, కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్, మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజాం, కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి, నాయకులు నేమూరి భూమయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.