ముద్ర, కోరుట్ల;
కోరుట్ల పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రవణా నక్షత్రం సందర్భంగా శనివారం రోజు సాయంత్రం సామూహిక “శ్రీ వెంకటేశ్వర స్వామి సామూహిక వ్రతం” ను ఆలయ ప్రధాన అర్చకులు బీర్నంది నరసింహచారి వైదిక నిర్మాణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా ఉత్సవ విగ్రహాలకు ఫల పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పూలతో ప్రత్యేకంగా అలంకరించి, సహస్రనామాలతో ప్రత్యేక పూజ చేశారు. పూజానంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయానికి వచ్చిన భక్తులు అల్పాహారం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ జువాడి కృష్ణారావు ఆలయ చైర్మన్ యతిరాజం నర్సయ్య, కర్తలు నేతి శ్రీనివాస్, కటకం దివాకర్, కోట గంగాధర్, గోడికే రాములు, చిలువేరు విజయ్, చిట్యాల పద్మ, ఆలయ అధికారి ఎం. విక్రమ్ జూనియర్ అసిస్టెంట్ నరసయ్య, తిరుమల గంగాధర్, పూప్పల ప్రభాకర్, ఆండాళ్ గోష్టి భక్త బృందం, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.