Take a fresh look at your lifestyle.

పట్టణం అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటూ

  • జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణం అభివృద్ధి చేసి నన్ను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటూ అని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పేర్కొన్నారు.జగిత్యాల పట్టణ 2, 17,18 వార్డులలో టి యు ఎఫ్ ఐ డి సి ఫేస్ 1 లో భాగంగా రూ. 25 లక్షల నిధులతో బీటీ రోడ్డు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. అనంతరం రైసింగ్ తెలంగాణ 2047 కార్యక్రమం లో భాగంగా 100 రోజుల పట్టణ ప్రణాళిక అవగాహన ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల అభివృద్ధికి అత్యధిక నిధులు మంజూరు చేయటం జరిగిందని, పట్టణంలో రోడ్లు ఎక్కడ వెడల్పు ఉంటే అక్కడ అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు.జగిత్యాల పట్టణ నలువైపులా మార్కెట్ లు అభివృద్ధి చేశామని,ఎన్నో ఏళ్లుగా రైతు బజార్ మూలనపడితే వినియోగం లోకి తీసుకొచ్చామన్నారు.విద్యానగర్ స్కూల్ జోన్ ను మార్చి రెగ్యులర్ చేయటం వల్ల నేడు ఇళ్ల నిర్మాణాలకు చట్ట బద్దంగా అనుమతులు,బ్యాంకు లోన్ లు వస్తున్నాయని తెలిపారు.4520 మంది నిరుపేదల కోసం డబల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించామని,పాత బస్టాండ్ నుండి తిప్పన్న పెట్ రోడ్డు బ్లాక్ స్పాట్ రోడ్డు 16.5 కోట్లు మంజూరు అయ్యాయని,ముఖ్యమంత్రి సహకారం తో జగిత్యాల పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు.పట్టణ పరిశుభ్రత పచ్చదనం అందరి బాధ్యత అన్నారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన, మాజీ కౌన్సిలర్ లు బద్దం లతా జగన్,చుక్క నవీన్, ఏఇ అనిల్, మాజీ మున్సిపల్ చైర్మన్ లు అడువల జ్యోతి లక్ష్మణ్, గిరి నాగభూషణం, పురుషోత్తం రావు,బాలే శంకర్, క్యాదసు నాగయ్యా,శరత్ రావు, నారాయణ రెడ్డి, ముస్కుఎల్లారెడ్డి, రమేష్, సత్యనారాణ రెడ్డి,చంద్రయ్య,ఏ ఓ శ్రీనివాస్,టి యం సి రజిత, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ లు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.