Take a fresh look at your lifestyle.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి

  • రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండి గౌతమ్.

ముద్ర ప్రతినిధి కల్వకుర్తి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండి గౌతం అన్నారు. మంగళవారం కల్వకుర్తి మండలం రఘుపతిపేట లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు.లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి చేపట్టాల్సిన చర్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వం నిజమైన నిరుపేదలకే మంజూరు చేయడం జరుగుతుందని ఎలాంటి అవకతవకలకు పాల్పడిన చర్యలు ఉంటాయని అన్నారు. అనంతరం మండలంలో ఎన్ని ఇండ్లు మంజూరయ్యాయి వాటి పురోగతిపై చర్చించారు ఇండ్ల నిర్మాణాలపై సంతృప్తి వ్యక్తం చేశారు .

Leave A Reply

Your email address will not be published.