Take a fresh look at your lifestyle.

బిటి రోడ్డుకు తక్షణమే మరమ్మత్తులు చేపించాలి. -మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య.

మోత్కూర్ ముద్ర న్యూస్: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని ఆరెగూడెం, ముషిపట్ల రహదారిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో గత కొన్ని రోజులుగా వర్షాకాలంలో అధిక వర్షాలు కురయడంతో బీటీ రోడ్డు కోతకు గురి అయిందని ఈ దారి గుండా ప్రయాణించే ప్రయాణికులు రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య అన్నారు. తక్షణమే ఇట్టి రోడ్డును తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టి వాహనదారులకు ప్రజలకు రైతులకు అసౌకర్యాన్ని తొలగించాలని మున్సిపల్ కమిషనర్ కే సతీష్ కుమార్ ను ఆదేశించారు. ఇక కార్యక్రమంలో మేనేజర్ ప్రభాకర్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలి.

-మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య.

మోత్కూర్ అంగన్వాడి కేంద్రం 1లో ఆరోగ్య లక్ష్మి నూతన కమిటీ ఏర్పాటు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ ,వైస్ చైర్మన్ వెంకన్న ను కమిటీ అధ్యక్షుడిగా నియమించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిడిపిఓ యామిని హాజరై ఆరోగ్య లక్ష్మి పథకం ప్రాముఖ్యతను వివరించారు. మున్సిపల్ చైర్మన్ శ్రీమతి గడ్డం స్వప్న మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు చిన్నారులకు పౌష్టికా ఆహారం అందించడంలో కమిటీ సభ్యులు సమర్థవంతంగా పని చేయాలని సూచించారు.కార్యక్రమంలో 9వ వార్డు కౌన్సిలర్ బీసు శ్రీకాంత్, 11వ వార్డు కౌన్సిలర్ కరుపోతుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.