-మోత్కూర్ ముద్ర న్యూస్ :
ప్రజా ప్రభుత్వంలో పేదలకు ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనిని ఆనాడు ఇందిరమ్మ వైయస్ రాజశేఖర్ రెడ్డిలో నేడు సీఎం రేవంత్ రెడ్డి హయంలోని నిరుపేదలకు ఇల్లు ఇవ్వడం జరిగిందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. గురువారం మండలంలోని దత్తప్పగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు ఘనగాని సువర్ణ సాయిలు ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ నాడు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ,మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పేదలకు ఇండ్లు మంజూరు చేయగా నేడు అదే బాటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాయంలో పేదలకు ఇండ్లు నిర్మిస్తున్నారని ఇది ప్రజా ప్రభుత్వంలోని కాంగ్రెస్ పార్టీ గణతే నని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం బొందల గడ్డలు, స్మశానవాటికలు నిర్మించారని ఎద్దేవ చేశారు .మోత్కూర్ మున్సిపల్ లో కాంగ్రెస్ పార్టీకి గొప్పవిద్యాన్ని అందించిన మోత్కూర్ మున్సిపల్ ప్రజలకు దత్తప్ప గూడెం సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రేపు మాకు రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతా యని అన్నారు.కాంగ్రెస్ హయాంలో సన్నబియ్యం ఉచిత బస్సు మహిళలకు ఉచిత కరెంటు రైతు భరోసా రైతులందరికీ సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని అన్నారు. దత్తప్ప గూడెంలో కత్వ సమస్యల పరిష్కారానికి తాను ఇరిగేషన్ డీజీతో మాట్లాడాలని డీఈ వచ్చి ప్రతిపాదనలు తయారు చేసి పంపిస్తే ఇరిగేషన్ శాఖ నుండి నిధులు మంజూరు చేయించి సమస్య పరిష్కారానికి తన కృషి చేస్తానని ఎమ్మెల్యే స్వయంగా హామీ ఇచ్చారు