బడ్జెట్ 2026-27 సర్వసభ్య సమావేశంలో : జిల్లా గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షులు ఎండి అవైస్ ఉర్ రెహమాన్ చిస్తి
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
జిల్లాలోని అన్ని శాఖా గ్రంథాలయాలలో మౌలిక వసతులకు కృషి చేస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షులు ఎండి అవైస్ ఉర్ రెహమాన్ చిస్తి అన్నారు. సోమవారం జిల్లా గ్రంథాలయంలో ఆయన అధ్యక్షతన బడ్జెట్ 2026-27 సర్వసభ్య సమావేశం నిర్వహించారు. 2026-27 బడ్జెట్ అంచనాలును ఆమోదించి పౌరసంచాలకులు శాఖ హైదరాబాద్ కి ప్రతిపాదనలు పంపుటకు తీర్మానించిన్నట్లు చెప్పారు. జిల్లా కేంద్ర గ్రంథాలయం, జిల్లాలోని శాఖా గ్రంధాలయాలలో మౌలిక వసతులు కల్పించుట వంటి అంశాలకు ఆమోదం, జిల్లా కేంద్ర గ్రంథాలయం లో దివ్యాంజన్ సెక్షన్ దివ్యాంగులకు కొరకు ప్రారంభించిన్నట్లు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ కార్యాలయ సిబ్బంది, జిల్లా విద్యాశాఖ సిబ్బంది, జిల్లా ఉపసంచాలకులు వయోజన విద్య, జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి యం.సుధీర్, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.