ముద్ర, తాండూర్:
వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికల్లో 67.54% పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. తాండూరు పట్టణంలో మొత్తం 36 వార్డులకు ఎన్నికలు జరగగా బి ఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య హోరా హోరీగా
ఎన్నికల జరిగాయి. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కాంగ్రెస్, బి ఆర్ఎస్ పార్టీల మధ్య పోటీ హోరహారిగా జరిగింది. తాండూరులో ఎంఐఎం, బిజెపి పార్టీలకు చెందిన అభ్యర్థులు కూడా ఎన్నికల్లో తలపడ్డారు.
తాడూరు మున్సిపల్ పరిధిలో మొత్తం 52 వేల 25 మంది బుధవారం ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో మహిళ లు 26,534 మంది పురుషులు 25 488 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈనెల 13న జరిగే ఓట్ల లెక్కింపు తో అభ్యర్థుల భవితవ్యం తెలనుంది.
తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూర్ మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయం ఖాయమని చెప్పారు. తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 250 మందికి పైగా పోలీస్ సిబ్బంది బందోబస్తును పర్యవేక్షించారు. 600 మందికి పైగా ఎన్నికల సిబ్బంది అధికారులు పోలింగ్ లో విధులు నిర్వహించారు.