Take a fresh look at your lifestyle.

వివాహానికి వెళుతూ ఘోర రోడ్డు ప్రమాదం

  • 4 నెలల బాబు మృతి.
  • రోడ్డు ప్రమాదంతో ఆగిన పెళ్లి.

మల్యాల, ముద్ర విలేఖరి: కొండగట్టు శివారులోని పంచముఖ హనుమాన్ వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నాందేడ్ నుండి హుజురాబాద్ వెళ్తున్న ఎర్టిగా కారు కరీంనగర్ నుండి మహారాష్ట్ర వెళ్తున్న డీసీఎం వ్యాన్ ఎదురెదురుగా ఢీ కొన్నాయి.ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.వివాహానికి నవ వరుడితో సహా కుటుంబ సభ్యులు వెళ్లే క్రమంలో విషాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో 4 నెలల బాబు సంఘటన స్థలంలోనే చనిపోగా, నవ వరుడు తో సహా ఆరుగురు క్షతగాత్రులకు తీవ్ర గాయాలు కాగా 108లో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన తో పెళ్లి ఇంట తీవ్ర విషాదం నెలకొంది.

Leave A Reply

Your email address will not be published.