Take a fresh look at your lifestyle.

మరణంలోనూ వీడని బంధం

  • ఒకే చితిపై భార్యాభర్తల అంత్యక్రియలు

కోరుట్ల,ముద్ర: దేవుడు ప్రసాదించిన జీవితంలో పెళ్లి చేసుకొని 45 సంవత్సరాలు ముగ్గురు కూతుర్లతో మనవళ్లు మనవరాళ్లతో ఆనందంగా గడిచిపోయింది శేష జీవితం ప్రశాంతంగా గడుపుదాం అనుకున్న ఆ వృద్ధ దంపతులకు ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యు ఒడిలోకి చేర్చుకుంది.వివరాల్లోకెళ్తే కోరుట్ల పట్టణ విలీన గ్రామమైన యకీన్ పూర్ లో విషాదం చోటు చేసుకుంది.ఆదివారం రోజు మెట్ పల్లి మండలం వేంపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జవిడి నర్సారెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే.ఆస్ట్రేలియా లో ఉన్న నర్సారెడ్డి కూతురు అంత్యక్రియలకు వస్తున్నందున రెండు రోజులు ఆలస్యంగా మంగళవారం నిర్వహిస్తామని అన్నారు.అదే ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన మృతుని భార్య జవిడి లక్ష్మి చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది అన్న వార్త తెలియడంతో గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.ఒకే ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుకున్నాయి.నర్సారెడ్డికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.అందరికీ పెళ్లిళ్లు కాగా మనుమలు,మనుమరాళ్లు ఉన్నారు.అంత్యక్రియల్లో బంధాన్ని విడదీయకుండ ఒకే చితిపై భార్యాభర్తలను చేర్చి ఇద్దరినీ చేర్చారు.అంత్యక్రియల్లో మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ లోకబాపురెడ్డి, పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు.అలాగే ఇదే గ్రామంలో మున్సిపల్ విధులు నిర్వర్తించిన బద్ది భగవాన్ అనే కార్మికుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మృతి చెందాడు.గ్రామంలో ఒకే రోజు ముగ్గురి అంత్యక్రియలు నిర్వహిస్తుండడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.